నవతెలంగాణ-మెట్‌పల్లి
మెట్‌పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 498, 50లో ప్రభుత్వం మొదలు పెట్టిన ఇండిస్టీయల్ పార్క్, ఇథనల్ ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో జారీ చేసినట్టు గ్రామానికి భూ యజమానులు, తేజస నాయకులు తెలిపారు. తమ వ్యవసాయ భూముల్లో ఇండిస్టీయల్ పార్క్ పనులను చేపట్టాద్దంటూ గ్రామస్తులు హైకోర్డుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు స్టే ఇచ్చింది. కోర్డు ఆర్డర్ ప్రకారం గ్రామంలోని 498, 506 సర్వే నెంబర్లలో ఎలాంటి పనులు చేయవద్దని పేర్కొంది. ఈ పత్రాలను తెలంగాణ జన సమితి గ్రామ జేఏసీ నాయకులు మెట్‌పల్లి సబ్ కలెక్టర్, తహసీల్దార్‌కు అందించారు. తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కంతి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్ల చిట్టపూర్ శివారు లోని సర్వే నెం.498, 506లో నిరుపేద రైతులకు గత ప్రభుత్వాల హయాంలో భూ పట్టాలు పంపిణీ చేశారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ భూ ములను సాగు చేసుకుంటున్న రైతులకు తెలియ కుండానే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకని నేటి ప్రభుత్వం పన్నాగం పన్నిందని ఆరోపించారు. రైతులకు పంచిన భూములను తిరిగి తీసుకునేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఆప్రాంత నిరుపేద రైతులు ఉన్న కొద్దిపాటి భూములను కోల్పో తున్నా మని న్యాయ పోరాటం చేస్తున్నారన్నారు. అధి కారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించక పోవడం వలన భూ నిర్వాసితులు అయిన 25 కుటుంబాల రైతులు తెలంగాణ రాష్ట్ర హై కోర్టును ఇటీవల ఆశ్రయించగా, బాధిత రైతుల పక్షాన వాదనలు విన్న హై కోర్టు తగు విచారణ జరిపి స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అన్ని విషయాలను, రైతుల సమస్యలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించిం దన్నారు.తదుపరి తీర్పు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు, భూముల సేకరణ పనులు చేపట్టారాదని ఆదేశించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ తేలు ముత్తన్న, బహుజన గళం లింగంపల్లి నరేష్, తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్, యువజన సమితి జిల్లా అధ్యక్షులు కంతి రమేష్, మెట్‌పల్లి మండల అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్, విద్యార్థి జనసమితి రాష్ట్ర కార్యదర్శి తరుణ్, గ్రామ జె.ఎ.సి.నాయకులు చింతకుంట దేవేందర్, పులి సంజీవ్, ఒడ్డన్న, గొర్రె భీమన్న, మెంగ సంజీవ్, నర్సయ్య, మహిళా రైతులు, బాధిత రైతులు పాల్గొన్నారు.