– ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శనివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులు నల్లబోతుల మానసశ్రీ(5) కోరవేన వేదన్స్(3)పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దాంతో తీవ్రంగా గాయపడిన వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటపూర్‌లోనూ ఓ చిన్నారి, యువకుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.