ఆన్‌లైన్‌ పేరుతో ఒత్తిడి

– సమాన పనికి సమాన వేతనం కరువు
– ఇంకెప్పుడు రెగ్యులర్‌ చేస్తారని రెండో ఏఎన్‌ఎంల ఆవేదన
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెబుతూ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు పని ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. నిత్యం ప్రజా ఆరోగ్యం కోసం పరితపించే రెండో శ్రేణి ఆరోగ్య కార్యకర్తల దుస్థితి దయనీయంగా మారింది. పని భారంతో సతమతమవుతున్నారు. ఇంత చేసినా సమాన పనికి సమాన వేతనం లేదు. చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తున్న వీరికి గౌరవం లేదు.. ఉద్యోగ భద్రత లేదు. పనిభారం తగ్గించి రెగ్యులర్‌ చేయాలని రెండో ఏఎన్‌ఎంలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రెండో ఏఎన్‌ఎంలు ప్రభుత్వం అప్పగిస్తున్న అనేక పనులు చేస్తున్నారు. ఒక ఆరోగ్య కార్యకర్త పరిధిలో 4 గ్రామాలు ఉంటాయి. ఐదు వేల జనాభాకు వీరు సేవలు చేయాల్సి ఉంది. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. మహిళ గర్భం దాల్చింది మొదలుకొని కాన్పు అయ్యే వరకు రెండో ఏఎన్‌ఎంలే అన్నీ చూసుకోవాలి. ఫల్స్‌ పోలియో, ఓఆర్‌ఎస్‌ పంచడం, నట్టల నివారణ మాత్రలు వేయడం, ఎన్‌సిడి, బీపీ, షుగర్‌, వంటి వ్యాధిగ్రస్తులకు మాత్రలు ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 700 మంది రెండో శ్రేణి ఏఎన్‌ఎంలు ఉన్నారు. రాష్ట్రంలో 4000 మందిపైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు కొంత కాలంగా తమ ఉద్మోగాలను రెగ్యులర్‌ చేయాలని ఆందోళన చేస్తున్నారు.
ఆన్‌లైన్‌తో నలిగిపోతున్న ఏఎన్‌ఎంలు
ఒక వైపు ప్రజా ఆరోగ్య సేవల విషయంలోనే తలమునకలు అవుతుంటే.. మరోవైపు చేసిన పనులకు సంబంధించి ఆన్‌లైన్‌ చేయాలంటూ పై అధికారుల నుంచి రెండో ఏఎన్‌ఎంలపై ఒత్తిడి వస్తోంది. ఔట్‌ పేషెంట్‌ ఆన్‌లైన్‌, ఇన్‌పేషెంట్‌, బ్లడ్‌ కలెక్షన్‌, లెప్రసీ సర్వే, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, ఓరల్‌ కావిటి స్క్రీనింగ్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఇలా మొత్తం 20 సేవలను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. కలెక్టర్‌ మొదలు వైద్య అధికారుల వరకు అందరూ ఆన్‌లైన్‌ సమాచారం అడుగుతారు. ఒక ఆరోగ్య కార్యకర్త గ్రామాల్లో సేవలందిస్తూ ఇవన్నీ చేయాలంటే సాధ్యం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు ఫోన్‌ చేసి సమాచారం అడుగుతారని, నెట్‌ రావడం లేదన్నా వినిపించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇన్ని సేవలు చేసినా కనీస గుర్తింపు లేదు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి చావు ఖర్చులు అయినా ఎరగని క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు.
జీతం తక్కువ ఖర్చులు ఎక్కువ
వేతనాలు తక్కువ ఇస్తూ.. అనేక ఖర్చులు వారిచేత పెట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యాక్సిన్‌ అమౌంట్‌ ప్రతి కార్యకర్తకూ ఇవ్వాలి. వచ్చినా పై అధికారులు తీసుకొని రెండు ఏఎన్‌ఎంలకు ఇవ్వడం లేదు. సేవలను ఆన్‌లైన్‌ చేయడానికి నెట్‌ బ్యాలెన్స్‌కు డబ్బులు ఇవ్వడం లేదు. నెట్‌కు ప్రతి నెలా రూ.నాలుగు వందలు, జిరాక్స్‌ కోసం ఆరు వందల ఖర్చు అవుతోంది. వైద్య రంగానికి సంబందించిన అనేక పనులను ఆపరేటర్‌ చేయాల్సి ఉండగా ఏఎన్‌ఎం నుండే చేయిస్తున్నారు. వీటికోసం వచ్చిన నిధులను సూపర్‌వైజర్లు తీసుకుంటున్నారని తెలిసింది. పల్స్‌ పోలియో అమౌంట్‌ సైతం అందడం లేదు. ఔట్‌ సోర్సింగ్‌కు చెందిన మూడో శ్రేణి సిస్టర్స్‌కు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.
పని ఒత్తిడితో క్షీణిస్తున్న ఆరోగ్యం
పదేండ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం. ఆన్‌లైన్‌ సేవలతో విసిగిపోతున్నాం. పని ఒత్తిడితో ఆరోగ్యం చెడిపోతుంది. రాత్రి 11 తర్వాత కూడా సమాచారం అడుగుతున్నారు. ఒత్తిడి తట్టుకొని పనిచేస్తున్నా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం లేదు.
వర్క్‌లోడ్‌ తగ్గించాలి.
సుగుణ, 2 ఏఎన్‌ఎం, నాగర్‌కర్నూల్‌
వర్క్‌లోడ్‌ తగ్గించాలి
హెల్త్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పని భారం తగ్గించి 8 గంటల పని అమలు చేయాలి. ఇఎస్‌ఐ వర్తింపజేయాలి. ఎవరైనా ఉద్యోగి మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తాం
ఫసియోద్దీన్‌, రాష్ట్ర అధ్యక్షులు- తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌
రెండో శ్రేణి ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి
రెండో శ్రేణి ఏఎన్‌ఎంలు పనిభారంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏండ్ల తరబడి పనిచేసినా వారిని రెగ్యులర్‌ చేయడం లేదు. పీఆర్సీని అమలు చేయడంలో పూర్తిగా వివక్ష చూపుతున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండా వీరిని రెగ్యులర్‌ చేయాలి. 100 శాతం గ్రాస్‌ శాలరీని అందజేయాలి.
ఆర్‌.శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగర్‌కర్నూల్‌సిపి, జనసేన, టిడిపిలు గోడమీద పిల్లుల్లా వ్యవహరించడం తగదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, నగర కార్యదర్శి బి.పవన్‌ పాల్గొన్నారు.

Spread the love