రాతతో ఒత్తిడి నివారణ

– డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణ వేణి, పి.స్వరూపారాణి
– విద్యతోనే విజ్ఞానం సాధ్యమని ప్రముఖ డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్
మంగళవారం ముషీరాబాద్ డివిజన్ మొరం బొందలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నవభారత్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ పద్మా కమలాకర్, నవభారత లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి.స్వరూపా రాణి(ఈ) జి. కృష్ణవేణి పాల్గొని పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యతోనే విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు.విద్యార్థుల్లో చదవాలన్న తపన ఉంటేనే సరిపోదని అందుకు రాత కూడా ముఖ్యమని సూచించారు. చదివింది రాసినప్పుడే బాగా గుర్తు ఉంటుందని అన్నారు. ఆందుకు నోటు పుస్తకాలు ఎంతో అవసరం అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి చదవడం రాయడం అభ్యసించాలని సూచించారు. వ్రాయండి వల్ల కలిగే ఒత్తిడిని తొలగించి వచ్చానన్నారు. మరింత నేర్చుకొని, స్పష్టతతో కమ్యూనికేట్ చేయగలరన్నారు‌. వ్రాసేటప్పుడు మనస్సులో ఉన్నదాన్ని చక్కగా వివరించగలరు. కష్టమైన క్షణాలను వేగంగా అధిగమిస్తారని తెలిపారు. ఏమి జరుగుతుందో దాని గురించి వ్రాసే వారు కఠినమైన క్షణాలను త్వరగా అధిగమిస్తారని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని చెప్పారు. శ్రీలతా రాజేంద్ర కుమార్, అనిత, జి.కృష్ణవేణి స్పాన్సర్స్ చేశారన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ ఎం సుప్రియ నవీన్ గౌడ్, పాఠశాల హెచ్ఎం విజయ, టీచర్ రమాదేవి, బిజెపి నాయకులు నవీన్ గౌడ్, సత్యనారాయణ, కంచి కుమార్ ముదిరాజ్, అనిల్ కుమార్, మెట్టు వాసు తదితరులు పాల్గొన్నారు.

Spread the love