నవతెలంగాణ -జిన్నారం
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ) రవీందర్ రెడ్డి హెచ్చరించారు. జిన్నారం తహసీల్దార్ కార్యాలయ్యాన్ని ఆయన మంగళశారం సందర్శించారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దారు, సర్వేయర్ తదితర అధికార బందాలతో చర్చించారు. టీఎస్‌ఐఐసికి సంబంధించి కేటాయింపు, భూములు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. శివనగర్, మాదారం, జంగంపేట, జిన్నారం తదితర గ్రామాలకు సంబంధించిన భూముల అంశాలపై అధికారులతో కులంకశంగా చర్చిం చారు. అసైన్డ్ భూముల పట్టాదారులు తదితర విషయాలపై పూర్తి వివరాలతో నివేదికలు తయారు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీిఎస్‌ఐఐసి జోనల్ మేనేజర్ అనురాధతో భూముల కేటాయింపు తదితర అంశాలపై ఆర్డీవో ఫోన్లో మాట్లాడారు. రెవెన్యూ సంబంధిత పనుల్లో వేగం మరింత పెరగాలని స్థానిక అధికారులు ఆదేశించారు. మాదారం గ్రామంలో భామను చెరువుకు సంబంధించిన భూముల విషయమై ఆక్రమణలకు సంబం ధించి చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రెవెన్యూ అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఓటర్లు నమోదు ప్రక్రియ కచ్చితంగా చేపట్టాలన్నారు.ఇటీవల గడ్డపోతారం పారిశ్రామి కవాడలో వర్షాల నేపథ్యంలో నీట మునిగిన పరిశ్రమ లను, వరద కాలువల పరిస్థితిని ఈ సందర్భంగానే ఆర్డీవో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల తాసిల్దార్ రవికుమార్, డిప్యూటి తహసీల్దార్ మల్లికార్జున్ సర్వేయర్ రామభద్రం తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల : మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ సందర్శించి.. గుమ్మడిదల గ్రామంలోని 109, అన్నారంలోని 261, అనంతారంలోని 174, 173, 57తోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వివాదస్పద సర్వే నెంబర్ల భూముల వివరాలను ఆరా తీశారు. అతి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గుమ్మడిదల గ్రామంలోని 109 సర్వే నెంబర్ రైతులు ధైర్యంగా ఉండా లని సూచించారు. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి అనం తరం సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి రోజు వారి వివరాలను నమోదు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్ర మంలో జెడ్పీటీసీ కుమార్‌గౌడ్, తహసీల్దార్ గంగాభవాని, డిప్యూటీ తహసీల్దార్ కర్ణాకర్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు గోవర్ధన్ రెడ్డి, సర్వేయర్ రామభద్రం, పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.