నవతెలంగాణ-గోవిందరావుపేట
శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ములుగు డిఎస్పిఎన్ రవీందర్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ ను డిఎస్పి రవీందర్ సందర్శించారు . ఈ సందర్భం లో పసర పరిధి లోని లొంగిపోయిన మాజీ మావోయిస్టు లతో ఏర్పాటు చేసిన సమావేశం లో డి.ఎస్.పి రవీందర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు లతో సంబంధాలు పెట్టుకోరాదు అని, మావోయిస్టులు కు సంబందించిన ఏమైనా సమాచారం ఉంటే తమకు అందివ్వాలని, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని,శాంతి భత్రతలను కాపాడటం లో తమ వంతు సహకారం అందివ్వాలని తెలియచేసారు. ఈ క్రమం లో వారి యొక్క సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం నుండి పథకాలను అందించటం లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పటం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం పసర పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలిస్తూ నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్ ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులను గురుంచి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం లో పసర సి ఐ శంకర్ , పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ పాల్గొనటం జరిగింది.