విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

నవతెలంగాణ – నూతనకల్
అధికారుల వహిస్తున్న నిర్లక్ష్యంపై తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ ఆగ్రహం వ్యక్తం చేసి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బూరెడ్డి కళావతి సంజీవరెడ్డి జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. అధికారులు చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా అధికారులు సమావేశానికి క్రమశిక్షణ రహితము అన్నారు. సమావేశానికి వచ్చేటప్పుడు మండలంలో చేపట్టిన కార్యక్రమాలు, పనులపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండాలని, ఆ విధంగా లేకపోతే క్షమించదలేదని హెచ్చరించారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగంపల్లి నుండి నూతనకల్ మీదుగా వెంకేపల్లి వరకు మంజూరైన తారు రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంపై సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రతి అంగనివాడి కేంద్రాన్ని సందర్శించి, పౌష్టికాహారం అందేలా చర్య తీసుకోని, మూమెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై ఎంఈఓ రాముల్ నాయక్ ను సమాచారం అడగక సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ లో జరుగుతున్న భూమాత స్కీం పై రైతులకు అవగాహన కల్పించాలని, భూ సమస్యలు అనేకం నా దృష్టికి వస్తున్నాయని, రైతులందరికీ ఫ్లెక్సీ ల రూపంలో అవగాహన కల్పించి, ఏ అధికారి ఏ సమస్య పరిష్కరిస్తారో తెలిపే విధంగా అవగాహన పరచాలని రెవిన్యూ అధికారులను కోరారు. విద్యుత్ శాఖ పై జరిగిన చర్చలో ఏఈ రాకపోవడంతో అతని నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలని, అవసరం ఉన్నవారు ప్రభుత్వ అనుమతితో తీసుకోవాలని సూచించారు, అనంతరం ఎంపీటీసీల పదవీకాలం ముగించడంతో ఎంపీటీసీలకు పుష్పగుచ్చం ఇచ్చే శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ, ఎంపీటీసీలు ఎంపీడీవో సునీత, తాహసిల్దార్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Spread the love