– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్
– లిక్కర్ సీసాల దండతో సమ్మెకు మద్దతు ప్రకటించిన రిజ్వాన్
నవతెలంగాణ-తాండూర్ రూరల్
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు, ఆశలు, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారంతో 21రోజుకు చేరిం ది. రిజ్వాన్ అనే వ్యక్తి. లిక్కర్ బాటిల్ దండతో అంగన్ వా డీ కార్యకర్తలకు మద్దతు ప్రకటించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయపరమైన డిమాం డ్లను పరిష్కరించాలంటూ సమ్మె కొనసాగిస్తున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. గర్భిణులు, బాలింత లు, కిశోర, బాలికలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ, ఆశ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి స మాన వేతనం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్. నాయకులు సంపత్ కుమార్. అంగన్‌వాడీలు ఆశా వర్కర్లు. తదితరులు పాల్గొన్నారు.