ఇంటర్ లో 75 శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేయండి..

Strive to achieve 75 percent pass in inter..– జిల్లా కలెక్టర్ హనుమంతరావు ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఇంటర్మీడియట్ లో 75 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం రోజు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, లతో  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి మాట్లడుతూ టేలీ మనస్ గురించి వివరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్  ర్యాగింగ్, డ్రగ్స్ మీద అధ్యాపకులకు, ప్రిన్సిపాల్ కి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ఎలా అవగాహన కల్పించాలో కళాశాల ప్రిన్సిపల్ కు అవగాహన కల్పించారు. టెలి మానస్ ద్వారా  విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి టెలిమానస్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న మొదటి,  రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులపై  ప్రత్యేక దృష్టి పెట్టి  మంచి మార్కులు వచ్చే విధంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృషి చేయాలని తెలిపారు. మొదటి, రెండవ సంవత్సరంలో చదువుతున్న అన్ని కోర్సుల విద్యార్థులకు టెస్ట్ ల ను  నిర్వహించాలని, వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను పర్యవేక్షించాలని తెలిపారు. ఇంటర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. కళాశాలల అధ్యాపకులతో సమావేశాలను నిర్వహించారు.ఇంటర్ చదివే విద్యార్థులకు ప్రిన్సిపల్ లకు అవగాహన కల్పించారు. హాస్టల్స్ చదివే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్, జిల్లా ఇంటర్మీడియట్, నోడల్ అధికారి రమణి, బీ సీ సంక్షేమ అధికారి యాదయ్య లు పాల్గొన్నారు.
Spread the love