నవతెలంగాణ జగదేవపూర్
కొండపోచమ్మ తల్లి బ్రహ్మౌత్సవాలు మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా గజ్వేల్ ఎసిపి రమేష్, గజ్వేల్ రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, జగదేవపూర్ ఎస్‌ఐ చంద్రమోహన్ కలిసి తీగుల్ నర్సాపూర్ సర్పంచ్ రజిత రమేష్, టెంపుల్ ఈఓ మోహన్‌రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌తో కలిసి టెంపుల్ ఆవరణలో గల పార్కింగ్ ప్రదేశాలు సందర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి రమేష్, మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మౌత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని పోలీస్ అధికారులకు టెంపుల్ ఎండోమెంట్ అధికారులకు సిబ్బందికి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మౌత్సవాల సందర్భంగా శనివారం, ఆదివారం, సోమవారం, మూడు రోజులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేయాలని టెంపుల్ ఎదురుగా మెయిన్ రోడ్డు పై వాహనాలు పార్కు చేయవద్దని సూచించారు. భక్తులకు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, అర్చక బందం బిఅరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి,ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, నాయకులు , వార్డ్ నసభ్యులు తదితరులు ఉన్నారు.