అధికారం కోసం పోరాటం

Struggle for powerఅర్నాబ్‌ రే రాసిన 1960ల నాటి ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సిరీస్‌ ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’. ఈ సిరీస్‌ అక్టోబర్‌ 13 నుండి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం కానుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దీనికి మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహించారు. సుపర్న్‌ వర్మ సహ-దర్శకునిగా, సహ-రచయితగా పనిచేశారు. 1960 నాటి భారతదేశ మనోజ్ఞతను మళ్లీ ప్రతిబింబిస్తూ, తెరపై అద్భుతమైన దృశ్య ప్రపంచాన్ని సష్టిస్తూ దర్శకుడు మిలన్‌ లుత్రియా ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌తో అరంగేట్రం చేశారు. ఈ సిరీస్‌లో తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, అంజుమ్‌ శర్మ, వినరు పాఠక్‌తో పాటు నిశాంత్‌ దహియా, అనుప్రియ గోయెంకా, మౌని రారు, హర్లీన్‌ సేథీ, మెహ్రీన్‌ పిర్జాదా నటించారు. దీని గురించి దర్శకుడు మిలన్‌ లుత్రియా మాట్లాడుతూ, ‘ఇది నా మొదటి వెబ్‌ సిరీస్‌. 1960 నేపథ్యంలో ఇది గ్లామర్‌, యాక్షన్‌, సంగీతం, వన్‌ లైన్‌ పంచులు, వినోదం వంటి అంశాలతో నిండిన టైమ్‌లెస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ మల్టీ-స్టారర్‌ అర్జున్‌ భాటియా, (తాహిర్‌ రాజ్‌ భాసిన్‌) ప్రయాణాన్ని ట్రేస్‌ చేస్తుంది. దురాశ, ద్రోహం, ధైర్యం, అధికారం కోసం అంతిమ పోరాటాన్ని ఈ కథ అన్వేషిస్తుంది. నా కథల ద్వారా ప్రేక్షకులకు వినోదభరితమైన అనుభూతిని అందించడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Spread the love