– లైట్ మోటార్స్ డ్రైవర్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండి. మాలిక్
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేస్తామని లైట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండి. మాలిక్ తెలిపారు. డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో డ్రైవర్స్, ఒనర్స్ యూనియన్ నాయకులు కూర్చున్నారు. ఈసందర్భంగా మాలిక్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన యూనియన్ చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాదించేంత వరకూ జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమంలో ముందుంటామని తెలిపారు. జేఏసీ కో చైర్మన్ పుర్మ ఆగం రెడ్డి, జేఏసీ యూత్ నియోజకవర్గ నాయకుడు గద్దల మహేందర్, మహేష్, పచ్చిమడ్ల మహేందర్ గౌడ్, పాక బాలయ్య, రాచకొండ శ్రీనివాస్, తాళ్ల పల్లి పర్శరాములు, సాతెల్లి దేవయ్య, ఆడెపు చందు, ముస్త్యాల మహేందర్, పాక శ్రీనివాస్,సిర్ల మురళి, మైక్ యాదగిరి, అంబటి అంజయ్య గౌడ్, మాచర్ల మనోహర్, చుంచు పాపయ్య, శ్రీరామ్ రమేష్, మాచర్ల శ్రీనివాస్, కర్రె కరుణాకర్, ముస్త్యాల మహేష్, పూర్మ వాసుదేవ రెడ్డి, ఎండి. బాషమియా, తుమ్మలపల్లి గణేష్, పరంకుశం వెంకటేష్, ముస్త్యాల నరేష్, కర్క కిషోర్, చిలుకల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.