ఇండ్ల స్థలాలు వచ్చేంతవరకూ పోరాటం

పేదలకు ఇండ్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు
పగడాల యాదయ్య
నవతెలంగాణ-తుర్కయాంజల్‌
ఇండ్ల స్థలాలు వచ్చేంతవరకూ పోరాటం ఆపేది లేదని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం తుర్కయంజాల్‌లోని ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం సూపరింటెండెంట్‌ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుర్కయంజాల్‌ సీపీఐ(ఎం) మున్సిపల్‌ కన్వీనర్‌ డి.కిషన్‌ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య హాజరై మాట్లాడారు. తుర్కయంజాల్‌ మున్సిపల్‌ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఇండ్ల స్థలాలు లేక వేలాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు ఇదే ఆర్డిఓ కార్యాలయంలో సుమారు 4000 మంది దరఖాస్తులు చేసుకున్నారని, ఇంకా అనేకమంది దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇటువంటి నిరుపేదలను గుర్తించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను డైరెక్ట్‌గా హెచ్‌ఎండిఏ పేరుతో ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ చేసి పెద్దలకు కట్టబెడుతుందని నిరుపేదలకు జాగల అడిగితే భూములు లేవు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి అర్హులైన ప్రతివారికి ఇంటి స్థలం కేటాయించాలని, స్థలం ఉన్న ప్రతి పేదలకు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వం భరించాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని యెడల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మేమే గుర్తించి పేదలను సమీకరించి గుడిసెలు వేయిస్తామని భూములను కబ్జా చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జి కవిత, జిల్లా కమిటీ సభ్యులు ఈ నరసింహ, సీపీఐ(ఎం) నాయకులు ఎం సత్యనారాయణ, ఐ భాస్కర్‌, కె శంకర్‌, జె ఆశీర్వాదం, ప్రకాష్‌ కారత్‌, పెంటయ్య, శంకరయ్య, మాధవరెడ్డి, కే శారద, రత్నమ్మ, రోజా రాణి, శివ ప్రసాద్‌, నాగయ్య, పుల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love