చదువుపై ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ-వీణవంక

చదువుపై ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఘన్ముకుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆసిఫ్ కథనం ప్రకారం.. గన్ముకుల గ్రామానికి చెందిన గాజుల శశి కుమార్ హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా కళాశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో అతని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love