మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న సింగారెడ్డిపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న నూతనకల్ మండలం మచనాపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు కొంపల్లి సరస్వతి(10) మంగళవారం ఉదయం మృతి చెందింది. పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్ధిని ఉదయం ఆరు గంటలకు జ్వరం వస్తుందని పాఠశాల నర్స్ వద్దకు వెళ్లగా జ్వరం ఎక్కువగా ఉండటంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక సరస్వతికి ఫిట్స్ వస్తుండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళే క్రమంలో కార్డియాక్ అరెస్టు అయ్యి మధ్యలోనే మరణించినట్లు తెలిపారు.