
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పోలపల్లి మనోజ్ఞ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 14 ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు రాజేశ్వర్ శనివారం తెలిపారు. నేటి నుంచి ఆరవ తేదీ వరకు కామారెడ్డి జిల్లాలోని పోసానిపేటలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని పాఠశాల ప్రధానొపాధ్యాయులు రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్, మోహన్, శోభ, లింబాద్రి, రేణుక, గంగా మోహన్, లావణ్య, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.