ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం…

నవతెలంగాణ – హైదరాబాద్
ఓయూ ఠాగూర్ ఆడిటోరియం వెళ్ళే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే నల్లకుంటలో నివాసం ఉండే చైతన్య డీడీ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కలశాలలో ఎంపిసిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఈ రోజు ఉదయం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో అర్హత సాధించలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బరించలేని వేదనతో తిరిగి రోడ్డుపై వచ్చి కూర్చున్నాడు. ఎనబై శాతం కాలిన గాయాలతో ఉన్న విద్యార్దిని చూసిన ఓ వ్యక్తి ఓయూ సెక్యూరిటీ సిబ్బందికి సంచారం అందించాడు. సెక్యూరిటీ సిబ్బంది స్పందించకపోవడంతో ఓయూ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్దిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love