ట్రిపుల్ ఐటీ వార్డెన్ కు విధ్యార్థుల మద్దతు..

– వీసీ విషయం ప్రక్కదారి పట్టించడానికి కుట్ర
నవతెలంగాణ -ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ చీప్ వార్డెన్ కు విధ్యార్థులు మద్దతు తెలిపుతు శుక్రవారం రాత్రి ట్రిపుల్ ఐటీ తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సాలిడారిటీ. (టిఎస్ఎఎస్ ) సంఘం అధ్యక్షులు పేరిట పత్రిక ప్రకటన విడుదల చేశారు. చీప్ వార్డెన్ శ్రీధర్ పనిచేస్తున్నప్పటినుంచి కేర్ టేకర్లను ఎక్కువ సంఖ్యలో నియమించాలని రాతపూర్వకంగా తెలిపినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది వేల మంది విద్యార్థులకు కేవలం నలుగురు కేర్ టేకర్లు మాత్రమే ఉన్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ తనిఖీల్లో కూడా తేలిందని వారు తెలిపారు. వీసీ విషయాన్ని పక్కదారి పట్టించడానికి చీప్ వార్డెన్ పై కావాలని నిందలు మోపుతున్నారని వారు ఆ ప్రకటనలో ఆరోపించారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న ఘటనలు పాలనపరమైన, పర్యవేక్షణలోపం వల్లే జరుగుతున్నాయని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చీఫ్ వార్డెన్ అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

 

Spread the love