మాదక ద్రవలను నిర్మూలించడానికి విద్యార్థులు, యువత సహకరించాలి 

Students and youth should cooperate to eradicate drug addiction– పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ 
నవతెలంగాణ – ధర్మారం
మాదకతవ్యాలను ముగించడానికి విద్యార్థులు యువత పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో పెద్దపల్లి సీఐ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా పోస్ట్ ల గురించి మత్తు పదార్థాల వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల యువత నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. వాటి వల్ల జరిగే అనర్థాల గురించి సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వారిని ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ ఐ శీలం లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపాల్ అంగడ మల్లారెడ్డి, అధ్యాపకులు, 100 మంది విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love