విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

When the students are the teachers..– వెల్మగూడెం జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల స్వపరిపాలన
నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని వెల్మగూడెం జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో శనివారం ప్రధానోపాధ్యాయులు చీదేళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వపరి పాలనదినోత్సవం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా,అధికారులుగా, మంత్రులుగా ఎంఎల్ ఏ లుగా ఒక్కరోజు తమ ప్రతిభా పాటవాలతో తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠాబోధించారు.ఒక్క రోజు వారి విధులను చక్కగా నిర్వర్తించారు. సీఎంగా పీ యశ్వంత్, కలెక్టర్ గా అమ్రీన్, జాయింట్ కలెక్టర్ గా అంకిత, డీఈఓ గా శ్వేత, డిప్యూటీ డిఈఓగా కల్పన, ఎంపీడీఓ గా కీర్తన, ఎంఈఓ గా వినీత, ప్రధానోపాధ్యాయులుగా శివశంకర్, అటెండర్లు గా శివ, మణి లు వారి విధులు సక్రమంగా నిర్వహించారు.అనంతరం ఉత్తమ ప్రతిభ కన్ఫర్చిన వారికీ బహుమతు లు అందజేశారు.విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మన సంస్కృతి, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మార్క శ్రీనివాస్ విద్యార్థులకు బాలల స్వపరి పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. విద్యార్థులు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్య ఒక్కటెే మనల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు, వసంత కుమార్, హిమవంత రెడ్డి, రామకృష్ణారెడ్డి, రామాంజి రెడ్డి,సమత, శకుంతల, వెంకటయ్య,వాయ్యామ ఉపాధ్యాయుడు నిమ్మల లెనిన్ బాబు, అయోషా, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ లక్ష్మి సురేందర్ పాల్గొన్నారు.

Spread the love