బైరాగి గూడలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
మేయర్ మహేందర్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
విద్యార్థులు చిరుదశలోనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మేయర్ మహేందర్‌గౌడ్ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం బండ్లగూడ కార్పొరేషన్ బైరాగిగూడ మొదటి వార్డులో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాగి జావా మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. హరితహారం కింద మొక్కలు నాటారు. అదనపు గదులకు చేయూతనిచ్చిన ప్రయివేటు సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రామ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రభ, ప్రయివేటు సంస్థ నిర్వాహకులు, సత్యనారాయణ, కిరణ్, రామాంజనేయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.