ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు

నవతెలంగాణ-గోవిందరావుపేట

ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కర్లపల్లి లో డా”సర్వేపల్లి రాధాకృష్ణన్   జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీ. కల్తీ శ్రీనివాస్ వ్యవహరించి  డా “సర్వేపల్లి గారి జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దయసాగర్, నర్సయ్య, అశోక్, జగపతి, ఆదినారాయణ, గోపిసింగ్,సమ్మయ్య, సత్యనారాయణ,మల్లయ్య, రాములు, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, డైప్యూటీ వార్డెన్ బాలు, ఏ ఎన్ యం  ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Spread the love