ఐఐటీలో గౌలిదొడ్డి బాలుర కళాశాల విద్యార్థులు విజయకేతనం

నేషనల్‌ స్థాయిలో ర్యాంక్‌ల పంట
గౌలుదొడ్డి బాలుర ప్రిన్సిపాల్‌ పాపారావు
నవతెలంగాణ-గండిపేట్‌
నేషనల్‌ స్థాయిలో ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటి గౌలిదొడ్డి బాలుర కళాశాలలో విద్యార్థులు విజయకేతనం మోగించారని ప్రిన్సిపాల్‌ పాపారావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఐటి అడ్వాన్స్‌ ఉత్తమ ఫలితాలను సాధించి తమ గురుకుల కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారన్నారు. అవకాశం కల్పిస్తే తమ విద్యార్థులు ఎంతటి విజయాన్నైనా సాధించగల సత్తా ఉందన్నారు. చదువుకునే నేపథ్యం లేని నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు గౌలిదొడ్డి గురుకుల కళాశాల నుండి 50 మంది విద్యార్థులకు గాను 35 మంది విద్యార్థులకు డైరెక్ట్‌గా ఐఐటీలో ర్యాంకులు వచ్చినట్టు తెలిపారు. ఇందులో 12 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అధికారుల అండతో ప్రిన్సిపాల్‌ ఉపాధ్యాయుల సమిష్టి కషి తల్లిదండ్రుల తోడ్పాటు విద్యార్థుల నిరంతర కషితోనే ఈ విజయం సాధ్యమన్నారు. ఈ విజయానికి గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్ర కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ రంగారెడ్డి జిల్లా ఆర్‌ సిఓ డాక్టర్‌ శారద వెంకటేష్‌, రంగారెడ్డి ఓఎస్‌డి మరియు ఏసీఓ కిషోర్‌ తదితరులు అభినందిస్తున్నట్టు తెలిపారు. ఫలితాలలో జి సాత్విక్‌ 178 మార్కులతో ఎస్సీ కేటగిరిలో 53వ ర్యాంకు, కే రామకష్ణ 178 మార్కులతో బీసీ కేటగిరీలో 447 ర్యాంకు, పద్వి రాజ్‌ 93 మార్కులతో ఎస్‌ టి కేటగిరీలో 225 ర్యాంకు, పి లోకేష్‌ 75 మార్కులతో 1524 ర్యాంకు, జస్వంత్‌ 74 మార్కులు ఎస్సీ కేటగిరీలో 1576 ర్యాంకు పవన్‌ కుమార్‌ 70 మార్కులతో ఎస్సీ కేటగిరిలో 183 ర్యాంకు సాధించినట్టు తెలిపారు. మొత్తం 35 మంది డైరెక్ట్‌గా ఐఐటీ ర్యాంకులు సాధించి ఎంపికైనట్లు తెలిపారు. విజయానికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం ఉందన్నారు. కళాశాల తరఫున ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.

Spread the love