అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలి

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనడం అభినందనీయం
తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తాండూరు పట్టణ సీఐ రాజేం దర్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థికి సీఐ రాజేందర్‌రెడ్డి, మాస్టర్‌ మనోహర్‌, చైతన్య స్కూల్‌, ప్రిన్సిపల్‌ మాదర్‌, జిల్లా అక్రిడేషన్‌ కమిటీ సభ్యులు బి.సంజీవ్‌ చేతులమీదుగా కొరియా సర్టిఫికెట్‌ని తైక్వాండో క్రీడాకారుడు నోమన్‌కి ప్రదానం చేశారు. పట్టణ కేంద్రానికి చెందిన తైక్వాండో క్రీడాకారుడు నోమాన్‌ జులై 22, 23వ తేదీల్లో బెంగళూర్‌లో నిర్వ హించే 5వ నేషనల్‌ లెవల్‌ తైక్వాండో ఛాంపియన్‌ షిప్స్‌లో పాల్గొనడం సంతో షకరమని సీఐ రాజేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. సీఐ రాజేందర్‌ రెడ్డి మాట్లా డుతూ..జులై 22, 23వ తేదీల్లో బెంగళూర్‌లో నిర్వహించే 5వ నేషనల్‌ లెవల్‌ తైక్వాండో ఛాంపియన్‌ షిప్స్‌లో గెలుపొంది తాండూర్‌కి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ నర్సింహా, మాస్టర్లు కుశాల్‌, కుల్‌ సుం, అనాస్‌, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love