విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకెళ్లాలి సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ

అక్షర చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పురస్కారాలు
నవతెలంగాణ-నవాబుపేట్‌
విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకెళ్లాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అక్షర చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కా రాలు అందజేశారు. బుధవారం మండల కేంద్రంలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి గార్డెన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్షర చేయూత ట్రస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ కె యాదవ రెడ్డి, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ చేవెళ్ల శాసనసభ్యు లు కాలే యాదయ్య, అతిథులుగా హాజరయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ఒకప్పుడు నవాబుపేట్‌ మండలానికి ఉపాధ్యాయులు రావాలంటే పనిష్మెంట్‌గా భావించే వాళ్ళని నేడు అలాంటి పరిస్థితి నుంచి మొదటి ఆప్షన్‌గా మండలా న్ని ఎంచుకుంటున్నారని అన్నారు. విద్యార్థు లు బాగా చదువుకొని మండలానికి, తమ తల్లిదండ్రు లకు, ఉపాధ్యాయులకు, మంచి పేరు తీసుకురావా లని వారన్నారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మూడు విషయాలను గుర్తుంచుకోవాల ని అన్నారు. మొదటిగా తల్లిదండ్రులు గురువులు వారి ఇంటి పేరు నిలబెట్టావని ఉండాలన్నారు. ‘మీరు చదువుకున్న స్కూల్‌కి మీరు ముఖ్య అతిథిగా వెళ్లేలా గోల్‌ పెట్టుకోవాలన్నారు. జీవితంలో మీ సంతకాన్ని ఆటోగ్రఫీ ఇవ్వాలని మీరు నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. నేటి విద్యార్థులు టీవీ మొబైల్లో పెట్టే సమయాన్ని చదువులపై పెట్టాలన్నారు. విద్యతో పాటు వినయం నేర్చుకోవాలని ఆయన సూచించా రు. నమస్కారం, సంస్కారాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ఈ ట్రస్ట్‌కు విరాళంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌ లక్ష రూపాయలు విరాళంగా అందించారు. పెల్లి టీచర్స్‌ తరఫున టీచర్ల బృందం లక్ష రెండు వేల రూపాయలను విరాళం అందించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య లక్ష 11 వేల రూపాయలను విరాళం అందించారు. ఇంటర్మీడియట్‌ మోడల్‌ స్కూ ల్‌ నుంచి నలుగురికి ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యా ర్థులకు రూ. మూడు వేల నగదుతోపాటు జ్ఞాపికను అందించారు. జూనియర్‌ కాలేజ్‌ నుంచి ముగ్గురికి విద్యార్థులు, మండలంలోని వివిధ పాఠశాలల నుండి 14 మంది విద్యార్థులకు రూ.2వేలతోపాటు మెమొం టోను అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌గౌడ్‌ విద్యాధికారి గోపాల్‌, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, శివకుమార్‌, సత్య, సిద్ధాంతిని, రామ్‌రెడ్డి, జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ శోభారాణి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love