విద్యార్థులు మనోధైర్యాని కోల్పోవద్దు

– తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు
– సావిత్రి బాయి, ఫాతిమా భేగంలను స్ఫూర్తి గా తీసుకోవాలి
– రెండు కుటుంబాలకు న్యాయం జరిగేలా కమిషన్ కృషి, తెలంగాణ రాష్ట్ర ఎస్ సి, ఏస్ టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యార్థులు మనోదైర్యంతో ఉండాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం ఇమంపేట లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మి నారాయణ, రాంబాబు నాయక్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువు పై ఎకాగ్రత ను పెంచాకోవాలని, ఎలాంటి ఒత్తడికి లోనవకుండా మనోదైర్యం తో ముందుకు సాగాలన్నారు.సమస్యలకు చావే కారణం కాకూడదని సమస్యలు ఉంటే టీచర్లకు, తల్లిదండ్రులు కు తెలియజేసి సమస్యలను నివృత్తి చేసుకోవల్లన్నారు. దేశ భవిష్యత్ తరగతి  గదిలోనే ఆధారపడి ఉంటుందని ముఖ్యంగా బాలికలు సావిత్రి బాయి, ఫాతిమ బేగం లను ఆదర్శoగా తీసుకోవాలని, దేశ భవిష్యత్తు కి ఆడపిల్లలే ఆధారం, అభివృద్ధి అని అన్నారు. భువనగిరి, సూర్యాపేట జిల్లా లలో జరిగిన సంఘటనలు యావత్తు తెలంగాణ  ద్రిగ్బాoతి చెందిదని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ పాఠశాలలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టి మానసిక నిపుణులచె విద్యార్థులకు మానసిక ఒత్తిడికి లోనవకుండా తరగతులు చేపట్టే విదంగా కమిషన్ ప్రభుత్వానికి సిపార్సు  చేస్తుందని తెలిపారు. రెండు కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఎక్సగ్రేషియా, ఉద్యోగం అందేలా కమిషన్ సిఫార్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశం అయి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి విద్యార్థులతో తరగతి గదిలో వైష్ణవి, అస్మిత ల తోటి స్నేహితులు, తోటి విద్యార్థులతో కళాశాలలో ఏర్పాటు చేసిన పెర్వల్ కార్యక్రమం, తదుపరి సంఘటనలు విడివిడిగా అడిగి తెలుసుకున్నారు.ప్రతి పాఠశాలలో విద్యార్థులు పరీక్ష సమయంలో మనో ధైర్యాన్ని కోల్పోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడిపెంచ్చవద్దని స్నేహపూర్వక వాతావరణం లో పరీక్షలు రాసేవిధంగా ప్రోత్సాహించాలని సూచించారు.తదుపరి పాఠశాల, కళాశాల వసతి గృహంను కమిటీ సందర్శించి గదులు, మరుగుదొడ్లు లను పరిశీలంచారు.తదుపరి వైష్ణవి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, అదేవిధంగా అస్మిత కుటుంబ సభ్యులను కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.
కుల సంఘాలతో సమావేశమైన చైర్మన్, కమిటీ సభ్యులు: షెడ్యూల్డ్ కులాలు అన్ని రంగాలలో రానిచ్చేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. అన్ని సంక్షేమ పాఠశాలలో మానసిక నిపుణులచె ప్రత్యేక తరగతులు నిర్వహించేలా పైలట్ ప్రాజెక్ట్ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్స్ చేయునున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుల పట్ల తల్లిదండ్రులు, టీచర్లు ఒత్తిడి పెంచవద్దన్నారు .కుల సంఘాల నాయకులు జిల్లా లో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలో  త్రాగునీరు కొరకు ఆర్ ఒ ప్లాంట్, నాణ్యమైన ఆహారం అందించాలని , మరుగుదొడ్లు మరమ్మతులు, ప్రహరీగోడల నిర్మాణం, సి సి కెమెరా లు పనిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ కి వివరించారు. ముందుగా కొత్త వ్యవసాయ మార్కెట్ వసతి గృహంలో రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులను మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే కలిసి పుష్ప గుచ్చాలు అందజేసినారు.ఈ సందర్బంగా కలెక్టర్ ప్రభుత్వానికి అందజేసిన ప్రాధమిక నివేదిక తో పాటు, ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుల వివరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎ వెంకట్ రెడ్డి, ఏ ఎస్ పి నాగేశ్వరావు, డి.ఎస్.పి రవి, ఆర్డీవో కృష్ణయ్య, డిటిడిఓ శంకర్, SC వెల్ఫర్ అధికారిని లత, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్ సి ఓ అరుణ కుమారి, ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీలత కమిటీ సభ్యులు జ్యోతి పద్మ, ఓ ఎస్ డి ఉమ మహేశ్వరీ, డాక్టర్ అనిల్, డాక్టర్ స్రవంతి,కుల సంఘాల నాయకులు కోట గోపి, చిన్న శ్రీరాములు, బోడ శ్రీరాములు, నెమ్మది వెంకటేశ్వర్లు, నరసింహారావు, గుద్దేటి ఎల్లయ్య, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love