– ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి రాజేష్
– ఘనంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-జహీరాబాద్
తెలంగాణలోని విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాస్టర్ మైండ్ కళాశా లలో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం జెండాను రాజేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. 1970లో కేరళ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని.. అప్పటినుండి ఇప్పటివరకు గత 54 ఏండ్లుగా విద్యారంగ పరిరక్షణకు నిరంతరం పోరాడుతున్నదన్నారు. విద్యార్థులను ఏకం చేసి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడాన్ని ఎస్ఎఫ్ఐ తన భుజస్కందాల మీద వేసుకుందన్నారు. దేశ ంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్ఎఫ్ఐ తన గళాన్ని, కలాన్ని ఈ నియంతత్వ ప్రభుత్వాల మీద ఎత్తి చూపుతున్నదన్నారు. దేశంలో సమానత్వాన్ని సాధించడం కోసం కూడా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతున్నన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాఘవేంద్ర, రాహుల్, పధ్వీరాజ్, తలహ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కంగ్టి: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షులు మిదిదొడ్డి పవన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కిందిదొడ్డి సతీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక విద్యార్థి ఉద్యమాలకు సిద్ధం కావాల న్నారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడిన ఈ 54 ఏండ్ల కాలంలో విద్యారగం కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఈ కార్యక్రవ ుంలో మండల నాయకులు గణేష్, సచిన్, రాజు, కార్తిక్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.