– ఎంపీడీఓ వినతి పత్రం అందించిన గ్రామస్తులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
కోతుల బారి నుంచి విద్యార్థులను కాపాడాలని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి కి ఆసుపాక గ్రామస్తులు వినతి పత్రం అందచేశారు.గ్రామంలోని పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాల లోకి వచ్చి విద్యార్థులను గాయ పరుస్తున్నాయని విద్యార్దులు తల్లిదండ్రులు ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు.అదే విధంగా గ్రామంలోని ఇళ్లలోకి చొరబడి వంట సామాగ్రి, ఇతర వస్తువులను సైతం ధ్వంసం చేస్తూ,బయటకు తీసుకు వెళ్తున్నాయి అని,పెంకుటిళ్లు పై కప్పులు పెంకుల ను పగల కొట్టం వల్ల వర్షాలకు ఇళ్లు కురుస్తున్నాయని,వాటి ఆగడాలు పెరిగి ఇప్పటికే విద్యార్థులు,గ్రామస్తులను గాయ పరరిచాయని విద్యార్థులు తల్లిదండ్రులు పిర్యాదు లో పేర్కొన్నారు.కోతులను బయట ప్రాంతానికి తరలించాలని, జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో లకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు పాయం దుర్గారావు,వెంకటేష్,రాజు, మొడియం వెంకటేష్ లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ కుమార మాట్లాడు తూ ఈ విషయాన్ని ఎం.పీ.ఈ హై.ఓ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.