నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్కోయిల్లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్ను అరెస్ట్ చేశారు. ఒక మహిళతో ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతనిపై ఫిర్యాదు రావడం, కేసు నమోదు చేయడం జరిగిపోయాయి. కనల్ కన్నన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా వారి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 1న కేసు నమోదు కాగా, తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. గత ఏడాది ఓ ఆలయం విషయంలో చేసిన వ్యాఖ్యలకు ఓసారి అరెస్టయ్యారు.