మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి సంరక్షించాలని మండల ఇన్చార్జ్ పాల మల్లేష్ సూచించారు. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు జీర్ల సత్యనారాయణ, జీర్ల సాయి తదితరులు పాల్గొన్నారు.