మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సుధీర్ కుమార్ ఆదివారం నాడు జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కారును కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సుధీర్ కుమార్ ఎంపీకి సన్మానించగా ఆయన ఎన్ఎస్ యు ఐ అధ్యక్షునికి అభినందించారు ఎంపీ అధ్యక్షునితో సరదాగా మాట్లాడుతూ.. ఏమి నడుస్తుంది ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకున్నారు. అంతా బాగే అంటూ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు ఎంపీకి తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ధన్నూరు గ్రామ యువకులున్నారు.