కేబుల్‌ రెడ్డిగా సుహాస్‌

Suhas as Cable Reddyసుహాస్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కేబుల్‌ రెడ్డి’. శ్రీధర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యాన్‌ మేడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్‌ నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా మేకర్స్‌ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని లాంచ్‌ చేశారు. ఈ పోస్టర్‌ సుహాస్‌ని ‘కేబుల్‌ రెడ్డి’గా ప్రెజెంట్‌ చేసింది. టైటిల్‌, ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌ సుహాస్‌ కేబుల్‌ డిష్‌ ఓనర్‌గా నటిస్తున్నట్లు సూచిస్తున్నాయి. సినిమా ఫన్‌ రైడ్‌గా ఉండబోతుందని హామీ ఇచ్చే పోస్టర్‌లో సుహాస్‌ సాధారణ గ్రామ యువకుడిగా కనిపించారు. ఇందులో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: మహి రెడ్డి పండుగుల, సంగీత దర్శకుడు: స్మరణ్‌ సాయి, ఆర్ట్‌ డైరెక్టర్‌: క్రాంతి ప్రియం.

Spread the love