పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : పాక్‌లోని ఖైబర్‌ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా శనివారం ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 19 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నుంచి దక్షిణ వజీరిస్థాన్‌లోని అస్మాన్ మాంజా ప్రాంతానికి భద్రతా దళాల కాన్వాయ్ వెళ్తుండగా ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. దాడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. గత బుధవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని వజీరిస్తాన్‌లోని దత్తా ఖేల్ బజార్‌లోని భద్రతా తనిఖీ కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్‌ దాడి చేయగా.. ఇద్దరు సైనికులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు.

Spread the love