అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఇంట్లోనే ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చిరునాంజి బాలకిషన్ (54) శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లు ఎడమ చెయ్యి పనిచేయ, అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజులు నిజామాబాద్ మనోరమ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఎడమ చేయి మాత్రం పని చేయడం లేదు. ఇంటి వద్దనే ఉంటూ చెట్ల మందులు కూడా వాడుతున్నాడు. అయినప్పటికీ ఆరోగ్యం బాగు కాకపోవడంతో నేను ఇక ఏ పని చేయను, నా యొక్క ఆరోగ్యం మంచిగా కాదు అని మానసికంగా కృంగిపోయి, జీవితంపై విరక్తి చెంది, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. తగు చర్య కొరకు మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.