ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు

Suicide is not the solution– ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
నేటి యువత, రైతులతో పాటు సమాజంలో అనేక చోట్ల ఆత్మహత్యకు పాల్పడటం సరైన మార్గం కాదని, రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షులు సంగెపు బోర్రన్న అన్నారు. మంగళవారం మండలంలోని గౌరాపూర్‌ గ్రామంలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. క్యాండిల్‌ వెలిగించి వారికి ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఉద్యోగం రాలేదనో, పరీక్షలో ర్యాంకులు రాలేదని, రైతులు పంటలు పండక అప్పులు తీర్చలేక ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సంఘటనలు చూస్తున్నామన్నారు. అనేక మంది పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. దీనికి మూలం ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదన్నారు. దీని నివారణకు మానసిక వైద్యుల సలహా సూచనలు తీసుకోవాలన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాదవ్‌ అశోక్‌, గ్రామస్తులు సుందర్‌, అంకుష్‌, అర్జున్‌ పాల్గొన్నారు.
లోకేశ్వరం : మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్వంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ కె.గౌతమ్‌, అధ్యక్షతన స్టూడెంట్స్‌ కౌన్సిలర్‌ చిన్నయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే బత్తిడికి లోను కావద్దని, ప్రతీ కష్టాన్ని ధీటుగా ఎదుర్కొని, నిలబడితేనే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలరని అన్నారు. మిమ్మల్ని నమ్ముకొని, మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లి తండ్రులకు ధైర్యాన్ని నింపాలన్నారు. బత్తిడికి గురికాకుండా మంచి అలవాట్లు అలవర్చుకొవాలన్నారు. చెడు వ్యసనాలను వదిలించుకొని, ఒక ప్రణాళిక బద్దంగా జీవితంలో ఒక గమ్యాన్ని ఏర్పర్చుకొని దానికోసం పాటు పడేలా కృషి చేయాలని అన్నారు. అంతేకాని క్షణికావేశంతో ఆత్మహత్యనే పరిష్కారం కాదని ఆ ఆలోచనను దరిదాపుల్లోకి కూడా రానివ్వవద్దని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వర్లు, విఠల్‌, ప్రమీల రాణి, నవీన్‌, మహేందర్‌, సాయినాథ్‌, హరీశ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love