
వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. రామన్నపెట్ గ్రామంలో భూమా రెడ్డి సతీమణి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరార్శించారు. వాడి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సుమన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరార్శించారు. పడగల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు రాజముత్యం తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సునీల్ యువసేన నాయకులు పాలెపు నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.