సిద్స్‌ ఫార్మ్‌ నూతన సిటిఒగా సునీల్‌ పొత్తూరి

హైదరాబాద్‌ : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తమ నూతన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సిటిఒ)గా సునీల్‌ పొత్తూరిని నియమించుకున్నట్లు ప్రకటించింది. కన్సల్టింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో సునీల్‌కు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని పేర్కొంది. వ్యాపార నిర్వహణలో సునీల్‌కున్న అశేష అనుభవం, సాంకేతిక నేపథ్యం తమ సంస్థ ఆవిష్కరణలు, వద్ధి లక్ష్యం చేరుకోవడానికి తోడ్పడు లభించనుందని సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్ధాపకుడు కిశోర్‌ ఇందుకూరి ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love