నవతెలంగాణ-హైదరాబాద్ : అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. ఒకవేళ బోయింగ్ స్టార్ లైనర్ సురక్షితం కాదని భావిస్తే స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తీసుకొస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన స్పేస్ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా జూన్ 5న సునీత రోదసిలోకి వెళ్లగా స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్య తలెత్తడంతో ఆమె అక్కడే ఉండిపోయారు.