అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సునీత కీలక నిర్ణయం

నవతెలంగాణ – ఢిల్లీ: ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను వైఎస్ వివేకానంద కూతురు సునీత  సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాశ్ ముందస్తు బెయిల్‌ను రద్దుచేయాలని సునీత కోరారు. అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సవాలు చేసింది. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవేనని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకిస్తుంది. సునీత పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ వాదనలు వినిపించనుంది. రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.

Spread the love