– 8 సీలింగ్ ఫ్యాన్లు వితరణ
నవతెలంగాణ – గంగాధర
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిభాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పెట్టుకున్న గోడుపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 8 సీలింగ్ ఫ్యాన్లను అందించారు. గత మూడు రోజుల క్రితం మహాత్మ జ్యోతిభాపూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. గురుకుల ఆవాసంలో మౌలిక వసతులు సరిగా లేవని, రాత్రి సమయంలో ఉక్కపోతతో నిద్ర పట్టడం లేదని సుంకె ఎదుట ఆవేదన చెందారు. ఈ సమస్యతోపాటు అనేక అంశాలపై విద్యార్థినులు గోడు వెళ్లబోసుకున్నారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వం , జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినులు చెప్పిన సమస్యలు ఇప్పటికిప్పుడే పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సుంకె పాఠశాలలో తక్షణమే ఫ్యాన్లు తిరిగేలా ఎనిమిది సీలింగ్ ఫ్యాన్లను అందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను పరిష్కరించారు. తమ గోడును విని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాత్రివేళ కష్టాలకు విముక్తి కలిగేలా 8 సీలింగ్ ఫ్యాన్లు అందించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుంకె పక్షాన బీఆర్ఎస్ మండల నాయకులు వేముల అంజి, నజీర్, ఆదిమల్లు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ, తదితరులు ఫ్యాన్లు అందించారు.