అంగన్‌ వాడీల సమ్మెకు మద్దతు తెల్పిన సుంకిరెడ్డి

నవతెలంగాణ-ఆమనగల్‌
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేపడుతున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమనగల్‌ పట్టణంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేపడుతున్న నిరవధిక సమ్మె దీక్షా శిబిరాన్ని మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి సందర్శించి వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నిరవధిక సమ్మెలో భాగంగా వారికి సహాయ సహకారాలు అందిస్తానని సుంకిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అనసూయమ్మ, సంధ్య, లక్ష్మమ్మ, లీలావతి, అలివేలు, రాజ్యలక్ష్మి, పద్మ, యాదమ్మ, సుగుణమ్మ, సుజాత, సునీత తదితరులు పాల్గొన్నారు.

Spread the love