ఏఎమ్‌ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. శివ కోన దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సునో సునామి’ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా, మంగళవారం ఫుల్‌సాంగ్ విడుదలై, క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టు కుంటుంది. లవ్, రొమాంటిక్ సాంగ్‌గా తెరకెక్కుతున్న ఈ పాటకు మల్లిక్ వల్లభ సాహిత్యం అందించగా, ప్రవీణ్ మని సంగీత సారథ్యంలో ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ ఆలపించారు. నిర్మాతగానే కాకుండా డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే బుల్లితెర మెగాస్టార్‌గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. రీ యూనియన్ బ్యాచ్‌గా కలిసిన కొంతమంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేదే ఈ సినిమా.