SRH vs KKR : క్వాలిఫయర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో కొద్దిసేపట్లో ఐపిఎల్ 2024 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ లో ఏది గెలిచినా ఫైనల్ కు వెళ్తుంది. ఇక టాస్ విషానికి వస్తే  హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్స్, పవర్ ప్లే ఎవరు ఫైనల్ కు వెళతారనేది నిర్ణయించనున్నది. హైదరాబాద్ జట్లు రెండూ ఏమాత్రం తీసిపోని జట్లే. ఓపెనర్స్ మీదే గేమ్ చాలా వరకు ఆధారపడుతుంది. అంటే ఎంతసేపు మైదానంలో నిలబడి ఎన్ని పరుగులు సాధిస్తారనేదే కీలకం కానున్నది. కోల్ కతా టీమ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెప్పుకోతగ్గ ఆటగాళ్లు. వాళ్లను నిలువరించనిదే హైదరాబాద్ జట్టు ముందుకు సాగదు.

Spread the love