నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీని ఆదరించండి

– ఖమ్మం సీపీఐ(ఎం) నియోజకవర్గ అభ్యర్థి యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం అసెంబ్లీ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ తో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు, కలిసి సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్ గెలుపు కోసం ప్రచారం జోరుగా సాగించారు. రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు పాల్గొని మాట్లాడుతూ. రాష్ట్రంలో, దేశంలో బీజేపీ పార్టీ బలపడకుండా ఉండేందుకు వామపక్ష పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీని గెలిపించాలని పలువురు రైతులు, కార్మికులు, వ్యాపారాలను కలిసి సీపీఐ(ఎం) పార్టీ కి ఓటు వేసి యర్రా శ్రీకాంత్ ను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు,త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజనేపల్లి శ్రీనివాసరావు, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బండారు యాకయ్య,తదితరులు పాల్గొన్నారు..

Spread the love