ఫాం ఆయిల్ టన్ను గెలలు కు మద్దతు రూ.20 వేలు చెల్లించాలి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఫాం ఆయిల్ టన్ను గెలలు కు మద్దతు ధర రూ.20 వేలు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను,ఆయిల్ఫెడ్ సంస్థను డిమాండ్ చేసారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాలు కార్యాలయంలో రైతుసంఘం మండల కమిటీ ఆద్వర్యంలో ముళ్ళగిరి గంగరాజు అద్యక్షతన నిర్వహించిన క్రియాశీల కార్యకర్తలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.రాయితీలు ఇచ్చి,సాగు విస్తరింప చేసినప్పటికీ గెలలు దిగుబడి,ఆయిల్ఫెడ్ చెల్లించే ధర రైతులకు గిట్టుబాటు అవడం లేదని వాపోయారు.గతేడాది ఒక్కటి రెండు నెల్లో గెలలు కు పెరిగిన ధర ఆధారంగా కార్మికులు వేతనం,గెలలు రవాణా వ్యయం పెరిగిందని తీరా నెల నెలా గెలలు ధర క్షీణించడంతో రైతులు నష్టాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఈ 13 న అశ్వారావుపేట లో జరిగే ఫాం ఆయిల్ రైతు రాష్ట్ర స్థాయి సదస్సుకు ప్రతీ రైతు హాజరై గిట్టుబాటు ధర పై మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు  పుల్లయ్య,అర్జున్,చిరంజీవి లు పాల్గొన్నారు.
Spread the love