పత్తి పంటకు మద్దతు ధర కల్పించాలి

Support price should be provided for cotton crop– కౌలు రైతులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లకిë
నవతెలంగాణ-చిట్యాల
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పంటకు మద్దతు ధర కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో రైతులు నిల్వ చేసిన పత్తిని సోమవారం మల్లు లకిë, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక.. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదని, నల్ల మచ్చలు ఉన్నాయనే సాకులతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కొనకపోవడం వల్ల దళారీలను ప్రోత్సహించినట్టుగా ఉందన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కూడా క్వింటాకు రూ.7521 ధర కల్పిస్తున్నారని, అలా కాకుండా కనీసం క్వింటాకు రూ.10వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో కాటన్‌ కంపెనీల యాజమాన్యం, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, సకాలంలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తలేరని రైతులు వాపోతున్నారని, కలెక్టర్‌ స్పందించి రైతులకు సహకరించాలని కోరారు.సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పత్తి సాగులో పెట్టిన పెట్టుబడులు కూడా రాక కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్‌, మాజీ జెడ్పీటీసీ పామ నుగుళ్ళ అచ్చాలు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, నాయకులు అరూరి శ్రీను, మండల అధ్యక్షులు లడే రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love