ఏపీ నిరుద్యోగుల జేఏసీ బర్రెలక్కకు మద్దతు

నవతెలంగాణ – హైదరాబాద్: ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నానంటూ కర్నె శిరీష అనే యువతి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో వైరల్ అయింది. దాంతో ఆమెను అందరూ బర్రెలక్క అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడా బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఆమెకు మద్దతుగా ఇటీవల ప్రచారం నిర్వహించారు. తాజాగా, బర్రెలక్క కర్నె శిరీషకు ఏపీ నిరుద్యోగుల జేఏసీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ప్రదర్శన నిర్వహించింది. ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు భారీగా హాజరై బర్రెలక్కకు మద్దతుగా నినాదాలు చేశారు. యువత మేలుకో… బర్రెలక్కను గెలిపించుకో అంటూ బ్యానర్ ను ప్రదర్శించారు. బర్రెలక్కకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని, అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love