– సీఎం రేవంత్ రెడ్డికి మంద కృష్ణ మాదిగ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను మంద కృష్ణతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.