నవతెలంగాణ – హైదరాబాద్: పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు సైతం సమయం ఇచ్చింది. అఫిడవిట్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకున్నది.. ఉత్పత్తుల స్టాక్స్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేసన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరుపుతున్నది.