నవతవెలంగాణ – హైదరాబాద్: మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడిని ఈడీ అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. సమన్లు పొందిన వ్యక్తి కోర్టు ముందు హాజరు కావడాన్ని కస్టడీలో ఉన్నట్లు భావించలేమంది. అతడిని ఈడీ కస్టడీలోకి తీసుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఇలాంటి కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడికి PMLA సెక్షన్ 45లోని 2 నిబంధనలు వర్తిస్తాయా అనే పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది.